అకాల వర్షం.. తడిసిన పత్తి మొక్కజొన్న(వీడియో)

23చూసినవారు
TG: వరంగల్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం దంచికొట్టింది. ఈ వర్షం కారణంగా వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉంచిన మొక్కజొన్న, పత్తి తడిసిముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కు తెచ్చిన పంట తడిసిపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రైతులకు ప్రభుత్వమే అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్స్ :