తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలు వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ, రైతులకు భారీ పంట నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీనివల్ల పలుచోట్ల చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.