
భర్త తాగుడికి బానిస.. కొడుకు అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య
ఏపీకి చెందిన సుధ కుటుంబం 15 ఏళ్లుగా హైదరాబాద్ లో నివసిస్తుంది. ఆమె భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, చిన్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండడం, దీనికి తోడు పెద్ద కొడుకు పక్కింట్లో నుంచి ఓ రాడ్డు తీసుకొచ్చి రూ. 25కి స్క్రాప్ కు విక్రయించాడు. దీంతో ఆ యజమాని వచ్చి పిల్లలను పెంచే పద్ధతి ఇదేనా అని మందలించాడు. దీంతో కుటుంబ పరిస్థితిలు, ఈ ఘటనతో కలత చెందిన ఆమె ఉరేసుకుంది.




