
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్కు రూ.100 కోట్లు.. అధికారిక జీవో జారీ
AP: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల పాతికేళ్ల కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. కోటిపల్లి-నర్సాపురం మధ్య ప్రతిపాదిత బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. కాగా సుమారు 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. మొత్తం నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.




