UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించడంపై నీతి అయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ స్పందించారు. కేంద్రం ఇంకొన్నాళ్లు ఉచితంగా UPI లావాదేవీలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. రూ.2 వేలకు మించి చేసే యూపీఐ లావాదేవీలపై వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
చిరు వర్తకులు, వ్యాపారులపై 0.4 శాతం ఛార్జీలు విధించడం వల్ల మళ్లీ నగదు వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.