పండుగ సీజన్‌లో యూపీఐ లావాదేవీలు రికార్డులు బద్దలుకొట్టాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ ఏడాది పండుగ కాలంలో రూ.17.8 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.15.1 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐతో పాటు డెబిట్ కార్డు వినియోగం కూడా పెరిగి రూ.65,395 కోట్లకు చేరింది. డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరుగుదల ఆర్థిక చురుకుదనానికి సంకేతమని ఈ నివేదిక పేర్కొంది.