అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం

101చూసినవారు
అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్ వర్సెస్ బరోడా మ్యాచ్‌తో అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియం పూర్తిగా నిండిపోయింది. అభిమానులు అభిషేక్ శర్మ, పాండ్యా వంటి ఆటగాళ్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉప్పల్ స్టేడియంతో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, అభిషేక్ శర్మ, హర్షల్ పటేల్ వంటి స్టార్ క్రికెటర్లు ఆడుతున్నారు.

ట్యాగ్స్ :