
దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి.. నలుగురికి గాయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ డ్రోన్లతో మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




