విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులు ఇవ్వడాన్ని అమెరికా తక్షణమే నిషేధించింది. భారతీయుడు హర్జిందర్ సింగ్ నిర్లక్ష్య డ్రైవింగ్‌తో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం ఈ నిర్ణయానికి కారణమైంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ విదేశీ డ్రైవర్లు అమెరికన్ పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు. అమెరికాలో ట్రక్ డ్రైవర్లు మైలుకు $0.6–$0.7 వేతనం లభిస్తుండగా నెలకు రూ.4.2–6.7 లక్షల వరకు సంపాదించవచ్చు.