
మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) ముగిసింది. ఇందులో పాల్గొనని లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో తమ ఓటు కూడా తొలగిపోయిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా 'ECI EPIC Number' అని టైప్ చేసి 1950 కి SMS పంపండి. మీ వివరాలతో రిప్లై వస్తే మీ ఓటు భద్రంగా ఉన్నట్లే. అలాగే, https://voters.eci.gov.in/enumerationformnew పోర్టల్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా తమ ఎస్ఐఆర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఓటు తొలగించబడితే.. కొత్త ఓటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.




