
వారణాసి షూటింగ్ 90% పూర్తి: రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. అక్టోబర్ నాటికి చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ కూడా పూర్తవుతాయని, డబ్బింగ్ కూడా త్వరలోనే మొదలవుతుందని దర్శకుడు రాజమౌళి తెలిపారు. IMAX ఫార్మాట్ కోసం కథలో మార్పులు చేయలేదని, కెమెరాలకు తగ్గట్లు చిన్న సర్దుబాట్లు చేశామని, ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నారు.




