అమెరికా-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు
అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరాన్‌కు సహకరిస్తున్న 60 సంస్థలు, నౌకలపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. దీనికి 'ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్' అని పేరు పెట్టారు. దీనిపై ఇరాన్ ప్రతిస్పందిస్తూ,
అమెరికా ఆంక్షలకు బెదిరిపోవడం లేదని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించింది. ఇందులో భాగంగా డాలర్ వ్యవస్థకు ఇరాన్ దూరంగా ఉంటోంది.