మార్చి 1 నుంచి అమెరికా హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల నుంచి ఈ ఫీజు 2,965 డాలర్లకు పెరగనుంది. ఇతర వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది.