
నటిపై క్యాస్టింగ్ ఆర్టిస్ట్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
TG: సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం ఇవ్వకుండా బెదిరించి, అసభ్యంగా ప్రవర్తించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒక నటికి 'ఆకాశంలో ఒక తార' సినిమాలో స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానంటూ ప్రసాద్ ఆమెను సంప్రదించాడు. షూటింగ్ పూర్తయ్యాక పారితోషికం ఇవ్వకుండా కాలయాపన చేశాడు. ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని సినీనిర్మాత కార్యాలయం వద్దకు ఆమెను పిలిపించి, బెదిరించి, కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.




