
మరో ఏఐ మోడల్‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ
ఏఐ రంగంలో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ఏఐ సంస్థ గ్రోక్ 4.5 అనే సరికొత్త ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఐపీఓ తర్వాత సంస్థ ఆవిష్కరించిన తొలి ఏఐ మోడల్. ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్స్‌తో సమానమైన సామర్థ్యాలను గ్రోక్ 4.5 కలిగి ఉందని, నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని ఎలాన్ మస్క్ తెలిపారు. ఇది ఆంథ్రోపిక్‌కు చెందిన ఓపస్ 4.7తో సమానమని, అధిక సామర్థ్యాలు, వేగవంతమైన పనితీరు, తక్కువ ధరతో ఇతర మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.




