అమెరికా అణ్వాయుధ పరీక్షలు పునఃప్రారంభం: ట్రంప్ ప్రకటన

16086చూసినవారు
అమెరికా అణ్వాయుధ పరీక్షలు పునఃప్రారంభం: ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ముందు 'ట్రూత్‌ సోషల్‌'లో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో అణు పరీక్షలు చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ, రష్యా, చైనా వంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో పరిస్థితులు మారాయని, అమెరికా కూడా అణ్వాయుధ సామర్థ్యంలో సమానస్థాయికి చేరుకోవడానికి పరీక్షలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్