నేపాల్‌కు అమెరికా రూ.296 కోట్ల సాయం

4537చూసినవారు
నేపాల్‌కు అమెరికా రూ.296 కోట్ల సాయం
తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం 31 మిలియన్ డాలర్ల (రూ.296 కోట్లకు పైగా) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత వంతెనల నిర్మాణం, బాధితుల సంక్షేమం, భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు డ్రోన్ల పంపిణీ నిమిత్తం ఈ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్‌లో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌తో అమెరికా రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ అల్లిసన్ హుకర్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఆమె ఈ సహాయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్