అమెరికా కార్మిక శాఖ H1-B వీసా ఉద్యోగుల వేతన వ్యవస్థను క్రమబద్ధీకరించింది. దీని ప్రకారం, ఉద్యోగులను నాలుగు స్థాయిలుగా విభజించారు. ఎంట్రీ లెవెల్ వర్కర్లను లెవెల్-1గా, అత్యంత నైపుణ్యం ఉన్నవారిని లెవెల్-4గా పరిగణిస్తారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ప్రస్తుత ర్యాండమ్ విధానంలోనే లాటరీ పద్ధతి కొనసాగుతుంది. అయితే, మిగతా ఉద్యోగాలకు వేతన స్థాయి ఆధారంగా లాటరీ విధానాన్ని అమలు చేయనున్నారు.