ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా ప్రతీకార దాడి

8145చూసినవారు
ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా ప్రతీకార దాడి
అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ తమ నౌకలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన మూడు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఖర్గ్ ద్వీపం తీరంలో రెండు ట్యాంకర్లను, ఒమన్ సముద్రంలో మరో ట్యాంకర్‌ను నేలమట్టం చేశామని తెలిపింది. "మీరు మా రెండు నౌకలపై కాల్పులు జరిపితే, మేము దానికి ప్రతిగా మీ వైపు నుంచి మూడింటిపై దాడి చేస్తాం" అని సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్