పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, రష్యా చమురు కొనుగోలుపై
అమెరికా ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేసి, ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు విచారణ సందర్భంగా, రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లు రూబియో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చామని, అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ట్రెజరీశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.