ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తరహాలోనే నెతన్యాహును కూడా కిడ్నాప్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెతన్యాహును ప్రపంచంలోనే అతిపెద్ద నేరస్థుడిగా పేర్కొన్న ఖవాజా, మానవత్వంపై నమ్మకం ఉంటే అమెరికా లేదా తుర్కియే ఈ చర్యకు దిగాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాకిస్థానీయులంతా ప్రార్థిస్తున్నారని చెప్పారు. దీంతో ఆసిఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.