
స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య
TG: హైదరాబాద్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో ఉరివేసుకుని 9 ఏళ్ల బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్ పరిధి రాజేంద్రనగర్ ప్రాంతంలో ప్రశాంత్(9) అనే బాలుడు తన స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో బాత్ రూంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




