
ప్రేయసిని దిండుతో అదిమి చంపిన ప్రియుడు
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సేలం జిల్లా అస్తంబట్టి సమీపం సుబ్రహ్మణ్యపురానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ భారతి(34)ని.. ఆమె ప్రియుడు ఉదయశరణ్(49) దిండుతో అదిమి హత్య చేశాడు. వీరిద్దరి మధ్య సోమవారం రాత్రి జరిగిన గొడవలో ఆగ్రహంతో ఉదయశరణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్పృహ కోల్పోయిన భారతిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఉదయశరణ్ను అరెస్టు చేశారు.




