
రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు: వాతావరణ శాఖ
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.




