
వర్షాల ఎఫెక్ట్.. ఆకాశానికి అంటుతున్న కూరగాయల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో కూరగాయల సరఫరా తగ్గింది. ఫలితంగా, బీరకాయ, దొండకాయ, బుడంకాయ, వంకాయ ధర కిలో రూ.80కి, బెండకాయ, కాకర, చిక్కుడు కాయ రూ.100, మంచి చికుడు కిలో రూ.120, సొరకాయ ఒకటి రూ.70, క్యాబేజీ రూ.80, పచ్చిమిర్చి కిలో రూ.50, ఆలుగడ్డ కిలో రూ.50కి చేరాయి. దీంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. కార్తీక మాసం, అయ్యప్ప భక్తుల మాలధారణతో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.




