ఇరాన్‌పై అమెరికా యుద్ధనౌకల దండయాత్ర: డొనాల్డ్ ట్రంప్

3చూసినవారు
ఇరాన్‌పై అమెరికా యుద్ధనౌకల దండయాత్ర: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి మరో యుద్ధ విమాన వాహక నౌకను పంపుతున్నట్లు ప్రకటించారు. చర్చలతో ప్రయోజనం లేదని, అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇరాన్ మాటలకే పరిమితమైందని, ఇక శాశ్వత పరిష్కారం కావాలని ట్రంప్ అన్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే భారీగా మోహరించిందని తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్