
ఫ్రీ బిర్యానీ కోసం హోటల్ యజమానిపై ఏఎస్సై దాడి (వీడియో)
AP: తిరుపతిలో ఓ ఏఎస్సై హల్చల్ సృష్టించాడు. ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలంటూ మద్యం మత్తులో హోటల్ యజమానిని చితకబాదాడు. సత్యనారాయణపురంలోని పూర్వీక కర్రీ సెంటర్లో ఫ్రీగా బిర్యానీ, చికెన్ కర్రీ ఇవ్వాలని ఏఎస్సై రాము బెదిరించాడు. డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్తుండగా అడ్డుకున్నందుకు హోటల్ యజమానిని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.




