
తాగుబోతు భర్త కొడుతున్నాడంటూ MLA వద్దకు మహిళ.. కేసు నమోదు
AP: తాగుబోతు భర్త కొడుతున్నాడంటూ గుంటూరుకు చెందిన రిజ్వానా అనే మహిళకు పోలీస్ స్టేషన్‌లో అనుకోని పరిస్థితి ఎదురైంది. కేసు నమోదు చేయాలంటే స్థానికంగా తెలిసిన వ్యక్తిని వెంట తీసుకురావాలని పోలీసులు చెప్పడంతో, ఆమె ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యే స్వయంగా మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిజ్వానా తరఫున కేసు నమోదు చేయించారు. రిజ్వానా ఆధార్ కార్డులో కందుకూరు చిరునామా ఉండటంతో, అక్కడి స్థానికతను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఆ సూచన చేసినట్లు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.




