UPI చెల్లింపులపై MDR ఛార్జీలు విధిస్తే వినియోగదారులు ఇతర చెల్లింపు మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందని LocalCircles సర్వే తెలిపింది. వ్యాపారులపై పడే భారాన్ని వారు వినియోగదారులపై మోపితే.. నగదు, క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంకు బదిలీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొంది. రూ.2 వేలకుపైబడిన చెల్లింపులకు UPIని ఉపయోగించబోమని 76 శాతం మంది సర్వేలో వెల్లడించినట్లు తెలిపింది.