
ఆర్చరీ రికర్వ్ మిక్స్డ్ టీమ్‌లో భారత్‌కు రజతం
ఆసియా క్రీడల్లో ఆర్చరీ రికర్వ్ మిక్స్డ్ టీమ్‌లో భారత్‌కు రజత పతకం దక్కింది. ఫైనల్లో భారత ద్వయం చైనా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్, మహారాష్ట్రకు చెందిన కుంకుం మొహద్ జోడీ ఈ రజత పతకాన్ని సాధించారు. ఇప్పటివరకు ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్ మొత్తం 67 పతకాలు సాధించింది, అందులో 11 బంగారు, 23 రజత, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.




