'ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రం సందడి ప్రారంభమైంది. తొలి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ మేకింగ్ వీడియోలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ కనిపించారు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.