
భారీగా తగ్గిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డుకు వెండి
బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,700 తగ్గి రూ.1,12,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,860 తగ్గి రూ.1,22,290 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగి ఆల్ టైం సంచలన రికార్డు సృష్టించింది. కేజీ వెండిపై రూ.3,000 పెరగడంతో రూ.1,80,000 వద్ద ధర కొనసాగుతోంది. 7 రోజుల్లో కేజీ వెండిపై రూ.18,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.




