యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరు అద్భుతంగా ఉందని భారత
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ముఖ్యంగా వైభవ్ మణికట్టు కదలికలు (రిస్ట్ వర్క్) ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బంతి లైన్ అండ్ లెంగ్త్‌ను ముందుగానే అంచనా వేస్తూ సులువుగా బౌండరీలు సాధిస్తున్న తీరు ఆకట్టుకుందని కొనియాడారు. చిన్న వయసులోనే ఆటపై మంచి అవగాహన, షాట్ సెలక్షన్ ప్రదర్శిస్తున్న వైభవ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని సచిన్ అభిప్రాయపడ్డారు.
Video Credits: Cricketopia