
తీవ్ర వాయుగుండం.. ఆ మూడు జిల్లాలకు ఆకస్మిక వరద..?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రపై ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు ఏర్పడటంతో శ్రీకాకుళం జిల్లాలో 11 గ్రామాలకు వరద ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ కాగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది.




