ఐపీఎల్‌లో భాగంగా GTతో జరిగిన క్వాలిఫయర్-2లో మ్యాచులో RR పోరాడి ఓడింది. ఈ మ్యాచులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. బ్యాటర్లు ఔట్ అవుతున్నా.. ఎంతో ఓపికతో 96 రన్స్ చేశాడు. అయితే మ్యాచ్ ఒడిపోవడంతో వైభవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతి రుమాలుతో కన్నీళ్లు తుడుచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తోటి ప్లేయర్లు అతడికి సపోర్టుగా నిలిచారు. 15ఏళ్ల వయసులోనే అద్భుత ఆట తీరు కనబర్చడంతో అతడిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.