తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు

18844చూసినవారు
తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు
AP: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31 & జనవరి 1) ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సాధారణ సర్వదర్శనం కల్పిస్తారు. ఈ పది రోజులూ ప్రోటోకాల్ VIPలు మినహా అన్ని సాధారణ VIP బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్, SED, ఆర్జిత సేవలు రద్దు చేశారు. గత ఏడాది తొక్కిసలాట ఘటన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్