నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

78చూసినవారు
నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే దర్శనాలకు ఉదయం 10 గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :