TG: మంత్రులపై జరుగుతున్న ప్రచారాలకు కారణం ఎవరని మాజీమంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 'కేసీఆర్ పాలనలో పదేండ్లు ఇటువంటి ఘటనలు జరిగాయా? గాంధీ భవన్, సీఎం ఆఫీస్ నుంచి ఘోస్ట్ సైట్లు పనిచేస్తున్నాయి. వాటినుంచే ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ముందు వాటిని బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది. రాజకీయాల్లో విలువలు పాటించాలి. తప్పుడు రాతలు ఎవరిపై వచ్చినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. గతంలో కేటీఆర్ మీద మంత్రులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాళ్ల కుటుంబాల్లో ఇబ్బంది పెట్టేలా చేశారు' అని అన్నారు.