తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్‌లోని చారిత్రక ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో ఆలయం గత 17 రోజులుగా జలదిగ్బంధనంలోనే ఉంది. దారులన్నీ మూసివేయబడ్డాయి. పదేళ్లలో ఇంతటి భీకర వరద ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్మవారు రాజగోపురంలో సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు.