త్వరలో వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశంలోని అన్ని రైళ్లను రీడిజైన్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ 3.0 స్థానంలో ఈ కొత్త వెర్షన్‌ను తీసుకురానున్నారు. రాబోయే 18 నెలల్లో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వందే భారత్ 4.0 గంటకు 320 కిలోమీటర్ల వేగంతో కవచ్ 5.0 సెక్యూరిటీ సిస్టమ్‌తో వస్తుంది. విదేశాలకు కూడా ఈ రైళ్ల ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి.