భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రాజస్థాన్‌లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) పర్యవేక్షణలో జరిగిన హైస్పీడ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, 'వాటర్ టెస్ట్' కూడా విజయవంతమైందని, రైలు స్థిరత్వాన్ని నిరూపించిందని తెలిపారు. ఈ పరీక్షలో విజయం సాధించడంతో, వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు ఉన్న ప్రధాన సాంకేతిక అడ్డంకి తొలగిపోయింది.