వందే భారత్ స్లీపర్: గంటకు 180 కి.మీ వేగంతో దూసుకుపోయేందుకు సిద్ధం

0చూసినవారు
భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో జరిగిన ట్రయల్ రన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగాన్ని విజయవంతంగా సాధించింది. ఈ సందర్భంగా లోకో పైలట్ క్యాబిన్‌లో తీసిన వీడియోలో, మూడు నీటి గ్లాసుల్లోని నీరు చుక్క కూడా కింద పడకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఈ ట్రయల్ రన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్