వందే భారత్ స్లీపర్ రైళ్లు డిసెంబర్‌లో: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

13934చూసినవారు
వందే భారత్ స్లీపర్ రైళ్లు డిసెంబర్‌లో: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న వందే భారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ క్లాస్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. మొదటి ప్రొటోటైప్ స్లీపర్ రైళ్లలో కొన్ని సమస్యలు గుర్తించామని, వాటిని సరిచేసి మెరుగైన నాణ్యతతో రైళ్లు రాబోతున్నాయని తెలిపారు. కొత్త రైలులో 16 కోచ్‌లు ఉంటాయి, ఇందులో ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.

సంబంధిత పోస్ట్