భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన 'వందేమాతరం' జాతీయ గేయం 150వ వార్షికోత్సవం శుక్రవారం నాడు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరాన్ని 150 ఏళ్ల 'వందేమాతరం'గా పరిగణించింది. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా సంస్మరణోత్సవాలు జరపాలని నిర్ణయించారు.