రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ గేయం 'వందేమాతరం'ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. భరతమాత కుమార్తెగా నిలబడి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం ప్రాముఖ్యతను పాఠశాలల్లో చిన్నారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి వివరించాలని, విద్యాశాఖ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సుధామూర్తి కోరారు.