ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అక్రమ కఫ్ సిరప్ దందా.. 3 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈడీ అధికారుల సోదాలు
Dec 15, 2025, 08:12 IST/

అక్రమ కఫ్ సిరప్ దందా.. 3 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈడీ అధికారుల సోదాలు

Dec 15, 2025, 08:12 IST
అక్రమ కోడిన్ ఆధారిత కఫ్ సిరప్ వ్యాపారంపై ఈడీ దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన 30 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా.. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసి, మూడు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్, అతని చార్టర్డ్ అకౌంటెంట్ విష్ణు అగర్వాల్, మాజీ యూపీ పోలీస్ కానిస్టేబుల్ అలోక్ సింగ్, అమిత్ సింగ్, విశాల్ సింగ్ ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. కఫ్ సిరప్ నిల్వలు, మళ్లింపు, అమ్మకాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.