TG: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు, తాజాగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు. కార్తీక మాసం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు, ఆలయ ప్రధాన ద్వారం మూసివేయడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.