సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత, వెంకటేష్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమా చేయనున్నారు. వీరిద్దరూ రెండు దశాబ్దాల క్రితం కలిసి పనిచేశారు. త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పుడు వెంకటేష్‌తో సూపర్ హిట్ అందించారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా మారిన త్రివిక్రమ్‌తో వెంకటేష్ చేసే సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారిక హాసిని బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. 2026 సమ్మర్‌కు సినిమాను విడుదల చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.