
తిరుమల జపాలీ తీర్థంలో తెల్లటి నీళ్లు.. కారణం ఏంటో తెలుసా?
తిరుమల కొండపై ఉన్న జపాలి తీర్థం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిల్లో నీళ్లు మజ్జిగలా తెల్లగా వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని, అయితే రుచిలో మార్పు లేదని భక్తులు తెలిపారు. ఈ విషయంపై తిరుమల టీటీడీ మెడికల్ ఆఫీసర్ సునీల్ స్పందిస్తూ, నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తామని, ఆ తర్వాతే కారణం తెలుస్తుందని చెప్పారు. నీటి బుడగలు, భూగర్భ జలాల్లోని ఖనిజ లవణాలు, లేదా ఉష్ణోగ్రతలోని తేడాలు వంటివి నీరు తెల్లగా మారడానికి కారణాలు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.




