హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు జంట నిన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిపై ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి స్పందించారు. సమంత, రాజ్ లకు పెళ్లి జరిగిందని తెలిసి చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. వారు మౌఢ్యంలో పెళ్లి చేసుకున్నారు కదా.. వారి వివాహ బంధం ఎలా ఉండబోతుందో జోస్యం చెప్పాలని అడుగుతున్నారన్నారు. అయితే ఈ అంశంపై తాను స్పందించనని కరాఖండిగా చెప్పేశారు. ఇదివరకే చైతన్య-శోభిత పెళ్లిపై మాట్లాడితే తనని తీవ్రంగా విమర్శించారని అన్నారు.